ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ

  • పార్లమెంటు స్ట్రీట్‌లో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష
  • ఆంధ్రప్రజల పక్షాన నిలబడతాం- రాహుల్ గాంధీ
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప‌లువురు ఈ రోజు పార్ల‌మెంటు స్ట్రీట్‌లో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. వారి దీక్షాస్థలికి వచ్చిన రాహుల్ గాంధీ.. దీక్షకు మద్దతు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో కాసేపు పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. 2019లో తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ నేతలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
Go Back to Shorts
Rahul Gandhi
Andhra Pradesh
Special Category Status

More Telugu News